ఇరాన్ ఓడరేవుల దిగ్బంధంలో కీలక పాత్ర పోషించిన నేవీ సెక్రటరీని తొలగించిన అమెరికా
- నావికాదళ కార్యదర్శి జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తప్పించిన అమెరికా
- జాన్ ఫెలాన్‌ను తప్పించడానికి గల కారణాలు వెల్లడించని వైట్ హౌస్
- కొన్ని వారాల క్రితం ఉన్నత సైనికాధికారిని తొలగించిన పీట్ హెగ్సెత్
అమెరికాలో నేవీ సెక్రటరీని పదవి నుంచి తొలగించారు. ఓ వైపు దాదాపు రెండు నెలలుగా ఇరాన్‍తో యుద్ధం కొనసాగుతుండగా, మరోవైపు అమెరికా నావికాదళ సెక్రటరీ జాన్ ఫెలాన్‌ను పదవి నుంచి తప్పించారు. నావికాదళ అత్యున్నత అధికారిని పదవి నుంచి తప్పించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవల ఉన్నత సైనికాధికారి జనరల్ రాండీ జార్జ్‌ను తొలగించారు. తర్వాత కొన్ని వారాలకే జాన్ ఫెలాన్‌ను తప్పించడం గమనార్హం. వాషింగ్టన్‌లో నావికాదళ వార్షిక సమావేశానికి పెద్ద సంఖ్యలో నావికులు, నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
జాన్ ఫెలాన్‌ను తొలగించడానికి గల కారణాలపై శ్వేతసౌధం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, అక్కడి ఓడ రేవులను దిగ్బంధించడం, నావికాదళానికి ప్రాతినిథ్యం వహించడంలో ఫెలాన్ కీలక పాత్రను పోషించారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చల ప్రతిష్ఠంభన కొనసాగుతున్న ప్రస్తుత కీలక సమయంలో ఆయనను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.