తెలంగాణలో 627 కరోనా కేసులు
Add ap7am to your home Screen

తెలంగాణలో 627 కరోనా కేసులు

new  627 COVID19 infections in telangana
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,822
  • కోలుకున్న వారు 2,72,370 మంది
  • మృతుల సంఖ్య మొత్తం 1,510
తెలంగాణలో గత 24 గంటల్లో 627 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 721 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,822కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,72,370 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,510కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 6,942 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 4,814 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 64,01,082 కరోనా పరీక్షలు నిర్వహించారు.


.
Corona Virus
COVID19
Telangana

More Telugu News