13 మందిని చంపిన హంతకుడికి డిసెంబరు 3న మరణశిక్ష.. ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు
- 2009 ఫోర్ట్ హుడ్ కాల్పుల్లో 13 మందిని కాల్చి చంపిన హసన్
- ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా శిక్ష అమలు చేయనున్న అమెరికా
- మరణశిక్షను లైవ్ ప్రసారం చేయనున్నట్లు పెంటగాన్ ప్రకటన
- న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే శిక్ష ఆలస్యమయ్యే అవకాశం
- శిక్ష ప్రత్యక్ష ప్రసారంపై న్యాయ నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు
అమెరికా సైనిక స్థావరం ఫోర్ట్ హుడ్‌లో 2009లో కాల్పులకు తెగబడి 13 మందిని చంపిన హంతకుడు నిడాల్ మాలిక్ హసన్‌కు డిసెంబరు 3న మరణశిక్ష అమలు చేయనున్నారు. ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా ఈ శిక్షను అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన అధికారులు.. తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. హసన్ మరణశిక్ష ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పెంటగాన్ గురువారం తెలిపింది. అమెరికాలో సైనికుడికి ఆరు దశాబ్దాలకు పైగా విరామం తర్వాత మరణశిక్ష అమలు కానుండటం, అది కూడా లైవ్‌లో చూపించనుండటం చర్చనీయాంశమైంది.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ బుధవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ శిక్షను ప్రజలు చూసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దీంతో మరణశిక్షను బహిరంగంగా నిర్వహిస్తారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. గురువారం పెంటగాన్ అధికారులు అసలు విషయం వెల్లడించారు. ఈ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.
హసన్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే మరణశిక్ష అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిర్బంధం చట్టబద్ధతను పరిశీలించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయవచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు, మరణశిక్షను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల మరణశిక్ష అమలు ప్రక్రియపై ప్రజలకు అవగాహన పెరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, శిక్ష ఎదుర్కొనే వ్యక్తి గౌరవం, ఇలాంటి ప్రసారాల వెనుక ప్రభుత్వ ఉద్దేశం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
2009 నవంబరు 5న ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరంలోని వైద్య భవనంలోకి వెళ్లిన హసన్ కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడ సైనికులు వైద్య పరీక్షలు, టీకాల కోసం వేచి ఉన్నారు. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడ్డారు. అప్పట్లో ఆర్మీ మేజర్‌గా పనిచేసిన హసన్.. 2013లో విచారణ సందర్భంగా తానే కాల్పులు జరిపినట్లు అంగీకరించాడు. పోలీసుల కాల్పుల్లో నడుము కింది భాగం చచ్చుబడటంతో ప్రస్తుతం వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు.