‘బాహుబలి’ని మించిన ప్రయోగం.. వారణాసి కోసం ప్రత్యేక భాష సృష్టిస్తున్న జక్కన్న?
- వారణాసి కోసం కొత్త కల్పిత భాష రూపొందిస్తున్నట్లు సమాచారం
- భాషకు ప్రత్యేక లిపి, వ్యాకరణ నియమాలు ఉండనున్నట్లు కథనాలు
- సినిమాలో పురాతన గుహ రహస్యాన్ని ఛేదించేందుకు ఈ భాష కీలకం
- ‘బాహుబలి’లోనూ రాజమౌళి ‘కిలికి’ భాషను ఉపయోగించిన వైనం
- సినిమాను 50 భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాల్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న వారణాసి కోసం మరో ఆసక్తికర ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ కల్పిత భాషను రూపొందిస్తున్నారట. అంతేకాదు.. ఆ భాషకు సొంత లిపి, వ్యాకరణ నియమాలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేశ్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘వెరైటీ’ కథనం ప్రకారం.. సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో ప్రధాన పాత్రలు ప్రాచీన లిపి ఉన్న ఓ గుహలోకి వెళ్తాయి. అక్కడి గోడలపై ఉన్న రాతల్లోని రహస్యాన్ని ఛేదించాలంటే వారికి ఆ కొత్త భాషను అర్థం చేసుకోవాల్సి ఉంటుందట. కథలో ఈ భాష కీలక పాత్ర పోషించనుందని సమాచారం.
‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాలోనూ రాజమౌళి కల్పిత భాషను ఉపయోగించిన విషయం తెలిసిందే. గేయ రచయిత, రచయిత మదన్ కార్కీ సహకారంతో రూపొందించిన ‘కిలికి’ భాషను ఆ సినిమాలో కాలకేయులు మాట్లాడారు. అయితే ‘వారణాసి’లో ఈ భాషకు మరింత ప్రాధాన్యం ఉండనుందని తెలుస్తోంది. పదాలు, వాక్య నిర్మాణం, లిపి సహా పూర్తి భాషను అభివృద్ధి చేయడానికి ఓ భాషా నిపుణుడిని నియమించినట్లు కథనాలు చెబుతున్నాయి.
ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 120 దేశాల్లో, 50 భాషల్లో విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు గతంలో ‘మిడ్ డే’ కథనం వెల్లడించింది. ఇందుకోసం దాదాపు 1,500 మంది వాయిస్ ఆర్టిస్టులకు ఆడిషన్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. ఏఐతో రూపొందించిన స్వరాల కంటే నటీనటుల భావోద్వేగాలను ప్రతిబింబించే మనుషుల గొంతులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.