తమిళనాడు ఉపఎన్నికలు: రెండుచోట్లా అధికార పార్టీ ముందంజ
- మధురాంతకం, ధారాపురం స్థానాల్లో ముందంజలో టీవీకే అభ్యర్థులు
- అన్నాడీఎంకే నుంచి గెలిచి టీవీకేలో చేరడంతో వచ్చిన ఉపఎన్నికలు
- సీఎం విజయ్ ప్రభుత్వానికి తొలి అగ్నిపరీక్షగా మారిన ఫలితాలు
- పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో డీఎంకే, అన్నాడీఎంకే వెనుకంజ
తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ (శుక్రవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో, తొలి రౌండ్‌లో వెలువడిన పోస్టల్ బ్యాలెట్ల సరళి ప్రకారం అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉంది. డీఎంకే రెండో స్థానంలో, అన్నాడీఎంకే మూడో స్థానంలో నిలిచాయి. పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టనుంది.
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే టికెట్‌పై గెలిచిన కె.మరగతం కుమారవేల్ (మధురాంతకం), పి. సత్యభామ (ధారాపురం) తమ పదవులకు రాజీనామా చేసి, అధికార టీవీకేలో చేరారు. దీంతో ఈ ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం వారిద్దరూ అవే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో టీవీకే అభ్యర్థిపై కుమారవేల్ 7,194 ఓట్ల మెజార్టీతో, డీఎంకే అభ్యర్థిపై సత్యభామ 16,727 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికల ఫలితాలు తొలి అగ్నిపరీక్షగా మారాయి. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీవీకేకు 108 సీట్లు మాత్రమే ఉన్నాయి. సాధారణ మెజార్టీకి 118 స్థానాలు అవసరం. ఈ నేపథ్యంలో ఈ రెండు స్థానాల్లో గెలుపు సాధిస్తే శాసనసభలో ప్రభుత్వ బలం పెరుగుతుంది. మరోవైపు, ఈ స్థానాలను నిలబెట్టుకోవడం ద్వారా తమ పట్టు నిరూపించుకోవాలని అన్నాడీఎంకే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ బలాన్ని ప్రదర్శించాలని డీఎంకే ప్రయత్నిస్తున్నాయి.
జిల్లా ఎన్నికల అధికారులు, పరిశీలకులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్‌లను తెరిచి కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం, తిరుప్పూర్ జిల్లాలోని ధరాపురం రెండు నియోజకవర్గాలూ షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.