మూడేళ్లకే రచయితగా ప్రపంచ రికార్డు.. భారత సంతతి బాలుడి ఘనత!
Add ap7am to your home Screen

మూడేళ్లకే రచయితగా ప్రపంచ రికార్డు.. భారత సంతతి బాలుడి ఘనత!

Advay Jain world record as author at three years old achievement of Indian origin boy
  • పురుషుల విభాగంలో పిన్న వయసు రచయితగా అద్వయ్‌ జైన్‌కు గుర్తింపు
  • ప్రీస్కూల్‌ అనుభవంతో పుస్తకం రాసిన బాలుడు
  • ఆహారాన్ని వృథా చేయొద్దని పుస్తకంలో సందేశం
  • ఏప్రిల్‌ 3న రికార్డును ధ్రువీకరించిన గిన్నిస్‌ సంస్థ
  • అద్వయ్‌ను అభినందించిన న్యూయార్క్‌ భారత కాన్సుల్‌ జనరల్‌
చిన్నారులకు ఆటలంటే ఇష్టం.. బొమ్మలంటే సరదా.. కానీ ఈ బుడతడికి మాత్రం పుస్తకం రాయాలనే ఆలోచన వచ్చింది. అంతే.. తనకు ఎదురైన ఓ చిన్న అనుభవాన్నే కథగా మలిచి పుస్తకంగా ప్రచురించాడు. దీంతో మూడేళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టించాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి బాలుడు అద్వయ్‌ జైన్‌ ఈ ఘనత సాధించాడు. పురుషుల విభాగంలో అత్యంత పిన్న వయసులో పుస్తకం ప్రచురించిన వ్యక్తిగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

న్యూజెర్సీలోని మన్‌మౌత్‌ జంక్షన్‌లో 2022 ఏప్రిల్‌ 23న అద్వయ్‌ జన్మించాడు. అతడు ప్రీస్కూల్‌లో మధ్యాహ్న భోజనం చేసే సమయంలో ఎదురైన అనుభవాలే పుస్తకం రాయడానికి ప్రేరణగా నిలిచాయి. అలా రూపుదిద్దుకున్న పుస్తకానికి ‘డైనో లెర్న్స్‌ నాట్‌ టు వేస్ట్‌ ఫుడ్‌’ అని పేరు పెట్టాడు. అంటే.. ఆహారాన్ని వృథా చేయకూడదని నేర్చుకున్న డైనో కథ అన్నమాట.

ఈ రికార్డును 2026 ఏప్రిల్‌ 3న న్యూజెర్సీలో అధికారికంగా ధ్రువీకరించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ వినయ శ్రీకాంత ప్రధాన్‌.. అద్వయ్‌ను కలిసి అభినందించారు. ఈ విషయాన్ని భారత కాన్సులేట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.

చిన్న వయసులోనే పుస్తకం రాసి ప్రచురించిన అద్వయ్‌.. ఆహారాన్ని వృథా చేయకూడదనే మంచి సందేశాన్ని చిన్నారులకు అందిస్తున్నాడని కాన్సుల్‌ జనరల్‌ ప్రశంసించారు. అద్వయ్‌ అక్క అవ్య కూడా రచయిత్రి, చిత్రకారిణి కావడం విశేషం. ఆమె వయసు 12 ఏళ్లు. ఇద్దరూ తమ సృజనాత్మకతతో మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
Advertisement
Advay Jain
Guinness World Record
Youngest Male Author
Indian American Boy
Dino Learns Not to Waste Food
New Jersey News

More Telugu News