సాయికృష్ణది కస్టడీ హత్యే.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు!
- విజయవాడ సాయికృష్ణది కస్టడీ మృతేనని తేల్చిన సిట్
- సీఐ సహా ఏడుగురు పోలీసులే నిందితులుగా ఛార్జిషీట్
- సాక్ష్యాలను మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన పోలీసులు
- 120 మంది సాక్షులను విచారించి కోర్టుకు నివేదిక సమర్పణ
రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టడీ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) న్యాయస్థానానికి ప్రాథమిక ఛార్జిషీట్‌ను సమర్పించింది. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ మృతికి పోలీసుల చిత్రహింసలే ప్రధాన కారణమని సిట్ తన నివేదికలో నిర్ధారించింది. ఈ కేసులో అప్పటి సీఐ నాగరాజుతో పాటు మొత్తం ఏడుగురు పోలీసులను నిందితులుగా పేర్కొంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసులో అత్యంత నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపినట్లు సిట్ కోర్టుకు వివరించింది. దర్యాప్తులో భాగంగా సుమారు 120 మంది సాక్షులను విచారించిన అధికారులు, కీలక ఆధారాలతో కూడిన 263 పత్రాలను 86 పేజీల ఛార్జిషీట్‌కు జతచేశారు. నాన్-బెయిలబుల్ వారెంట్‌పై ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి సాయికృష్ణను విజయవాడకు తరలించిన పోలీసులు, కృష్ణలంక స్టేషన్‌లో అతడిపై అమానవీయంగా దాడి చేసినట్లు తేలింది. తీవ్ర చిత్రహింసల కారణంగా ఆరోగ్యం క్షీణించి సాయికృష్ణ ప్రాణాలు కోల్పోగా, అనంతరం నిందితులు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, అర్థరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా శ్మశానవాటికకు తరలించి దహనం చేసినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది.
ఈ మరణాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు పక్కా ప్రణాళికతో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినట్లు సిట్ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లో నిందితుడికి సంబంధించిన ఎలాంటి వివరాలను నమోదు చేయలేదని పేర్కొంది. ఘటన అనంతరం స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని మాయం చేయడం, నేర ఆనవాళ్లు దొరక్కుండా పోలీస్ స్టేషన్‌కు రంగులు వేయించడం, లాకప్‌ను నీళ్లతో కడిగేయడం వంటి చర్యల ద్వారా సాక్ష్యాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్లు ఛార్జిషీట్‌లో పొందుపరిచారు.
సాయికృష్ణ మృతికి ఈ ఏడుగురు నిందితులే ప్రత్యక్ష బాధ్యులని సిట్ తేల్చిచెప్పింది. అయితే, ఈ కేసులో లోతైన దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ప్రత్యేక దర్యాప్తు బృందం న్యాయస్థానానికి విన్నవించింది.