జాతీయ రహదారి దిగ్బంధం.. భూమా అఖిలప్రియపై కేసు నమోదు
- నివర్ తుపాను దెబ్బకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ జాతీయ రహదారిపై మెరుపు ధర్నా
- కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు
- మరో 25 మంది టీడీపీ నేతలపైనా కేసులు
పట్టణంలో కొవిడ్ నిబంధనల మేరకు సెక్షన్-30 అమల్లో ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి జాతీయ రహదారిని దిగ్బంధం చేశారని, వాహన రాకపోకలకు, ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో అఖిలప్రియపై కేసు నమోదైంది. ఆమెతోపాటు మరో 25 మంది టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేసినట్టు ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.