India: దేశంలో మరో 37,975 మందికి కరోనా నిర్ధారణ

37975 new COVID19 infections in India
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 37,975 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,77,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,314 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 480 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,34,218కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,04,955 మంది కోలుకున్నారు. 4,38,667 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 13,36,82,275 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,99,545 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
Go Back to Shorts
India
Corona Virus
COVID19

More Telugu News