'సీఎం సొంత జిల్లాలో వైసీపీ నేతలు ముస్లిం మహిళను వేధిస్తున్న తీరు ఇది..' అంటూ వీడియో పోస్ట్ చేసిన నారా లోకేశ్
- వైసీపీ నేతలపై ధ్వజమెత్తిన లోకేశ్
- రాక్షసరాజ్యం సాగుతోందని వ్యాఖ్యలు
- ఒంటరి ముస్లిం మహిళను రోడ్డున పడేశారంటూ ఆగ్రహం
అంగన్ వాడీ ఉద్యోగమే ఆధారంగా బతుకుతున్న భర్తలేని నలుగురు పిల్లలున్న ముస్లిం మహిళను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఆమెపైనే తప్పుడు కేసులు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. నలుగురు పిల్లలతో ఒంటరి ముస్లిం మహిళను రోడ్డునపడేయడమేనా జగన్ మహిళలకు ఇచ్చే భరోసా? అని నిలదీశారు.