ఐపీఎల్ క్వాలిఫయర్-2: సన్ రైజర్స్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals won the toss in crucial match against Sunrisers Hyderabad
  • అబుదాబిలో ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్
  • సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
  • బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ  
అబుదాబిలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్లో ముంబయి ఇండియన్స్ తో తలపడుతుంది.

ప్లేఆఫ్స్ దశలో తొలి క్వాలిఫయర్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఢిల్లీ ఓటమిపాలవగా, ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరును ఇంటికి పంపిన సన్ రైజర్స్ క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది. ఇక, నేటి మ్యాచ్ విషయానికొస్తే... సాహా ఇంకా కోలుకోకపోవడంతో సన్ రైజర్స్ జట్టులో గోస్వామినే కొనసాగించనున్నారు. ఢిల్లీ జట్టులో ప్రవీణ్ దూబే, హెట్మెయర్ తుదిజట్టులోకి వచ్చారు.
Go Back to Shorts
Delhi Capitals
Sunrisers Hyderabad
Toss
Qualifier-2
IPL 2020
Abu Dhabi

More Telugu News