David Warner: ముంబైపై గెలిచిన ఆనందం.. మరోసారి ‘బుట్టబొమ్మ’ పాటకు వార్నర్‌ డ్యాన్స్!

david warner dance
షార్ట్స్‌లో చూడండి
‘అల వైకుంఠపురములో’  సినిమాలో‘బుట్టబొమ్మ’ పాటకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ స్టెప్పులు అదరగొట్టేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా కొన్ని నెలల క్రితం తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. తాజాగా, వార్నర్ మరోసారి ఇదే పాటకు స్టెప్పులేశాడు.
 
దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్- 2020లో లీగ్‌ దశలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి మ్యాచ్‌ ముంబైతో తలపడి గెలిచిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ను హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను దక్కించుకుంది.

ఈ నేపథ్యంలో తమ జట్టు సభ్యులతో కలిసి వార్నర్ ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారు వేసిన స్టెప్పులు నెటిజన్లను అలరిస్తున్నాయి.
Go Back to Shorts
David Warner
Hyderabad
IPL 2020

More Telugu News