పవన్ కల్యాణ్ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ కు ఛాన్స్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ కు ఛాన్స్?

Aishvarya Rajesh in Pawan Kalyans film
  • తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఐశ్వర్య  
  • 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ సరసన కథానాయిక 
  • పవన్ కల్యాణ్ తో 'అయ్యప్పనుమ్..' రీమేక్     
  • కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ఎంపిక 
'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఐశ్వర్య రాజేశ్ తమిళంలో పలు సినిమాలలో కథానాయికాగా నటించింది. గతంలో తెలుగులో పలు చిత్రాలలో నటించిన నిన్నటితరం కథానాయకుడు రాజేశ్ కి ఐశ్వర్య కూతురు కాగా, ప్రముఖ హాస్యనటి శ్రీలక్ష్మికి మేనకోడలు అవుతుంది.

ఈమధ్య తెలుగులో కూడా ఈమెకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఓ కథానాయికగా ఆమె ఇప్పటికే ఎంపికైనట్టు వార్తలొచ్చాయి. మరోపక్క, పవన్ కల్యాణ్ సినిమాలో కూడా ఆమె ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని పవన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి విదితమే. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కథానాయికగా ఐశ్వర్యను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో మరో హీరో కూడా నటిస్తాడు. ఆ పాత్ర కోసం రానా, నితిన్ పేర్లు వినిపిస్తున్నాయి.
Aishvarya Rajesh
Pawan Kalyan
Junior NTR
RRR

More Telugu News