అమెరికాలో మళ్లీ ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి.. నిన్న ఒక్కరోజులో ఏకంగా 91,295 కేసులు

US records 90000 coronavirus cases in 24 hours
  • 90 లక్షలు దాటిపోయిన కరోనా కేసులు
  • బ్రెజిల్‌లో 54,96,400 కేసులు
  • ఫ్రాన్స్ లో నిన్న ఒక్కరోజులో 47,000 కేసులు
  • యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ
అమెరికాలో కొన్ని రోజుల క్రితం వరకు కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అయితే, మరోసారి కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. నిన్న అమెరికాలో రికార్డు స్థాయిలో 91,295 కేసులు నమోదయ్యాయని  జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ నెల 15 నుంచి అమెరికాలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 90 లక్షలు దాటిపోయింది. ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో అమెరికా మరోసారి అగ్రస్థానానికి చేరింది.

కాగా, అమెురికా తర్వాత 80,88,851  కేసులతో భారత్ రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్ 54,96,400 కేసులతో మూడో స్థానంలో ఉంది. నిన్న బ్రెజిల్‌లో 26 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, రెండో వేవ్ మొదలైన ఫ్రాన్స్‌, యూకేల్లోనూ కరోనా విజృంభణ ఉద్ధృతంగా వుంది. నిన్న ఫ్రాన్స్ లో ఏకంగా 47,000 కేసులు నమోదుకాగా యూకేలో 23,000కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి.  
Go Back to Shorts
Corona Virus
COVID19
India
USA
france

More Telugu News