కీలకపోరులో రాజస్థాన్ రాయల్స్ ను కట్టడి చేసిన సన్ రైజర్స్ బౌలర్లు
- దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్
- మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్
- హోల్డర్ కు 3 వికెట్లు
ఆ జట్టులో టాప్ స్కోరర్ సంజూ శాంసన్. శాంసన్ 26 బంతుల్లో 36 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన హోల్డర్ ఓ రనౌట్ లోనూ పాలుపంచుకున్నాడు. ఇతర బౌలర్లలో విజయ్ శంకర్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, కెప్టెన్ స్మిత్ 19 పరుగులు నమోదు చేశారు.