టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా నైట్ రైడర్స్
- ఐపీఎల్ లో నేడు కోల్ కతా వర్సెస్ చెన్నై
- మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న కోల్ కతా
- పియూష్ చావ్లా స్థానంలో కర్ణ్ శర్మను తీసుకున్న చెన్నై
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్ కతాకు బ్యాటింగ్ లో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అదే లైనప్ ను కొనసాగించాలని నిర్ణయించింది. బౌలింగ్ విభాగంలోనూ మార్పులేమీ లేవు. ఇక చెన్నై జట్టులో ఓ మార్పు చేశారు. లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా స్థానంలో మరో లెగ్గీ కర్ణ్ శర్మకు చోటిచ్చారు.