చివరి ఓవర్లో ఛాతీపై బంతి తగిలినా సిక్సర్లు బాదిన తెవాటియా
- హై ఫుల్ టాస్ విసిరిన సైనీ
- బంతిని ఆడబోయి విఫలమైన తెవాటియా
- ఆపై రెండు బంతుల్లో రెండు సిక్సర్లు
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ 12 బంతుల్లో 22 పరుగులు చేశాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) తక్కువ స్కోరుకు అవుటయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సంజు శాంసన్ (4) అందరినీ నిరాశకు గురిచేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న మహిపాల్ లొమ్రోర్ 47 పరుగులతో రాణించాడు. చివర్లో తెవాటియా ధాటిగా ఆడడంతో రాజస్థాన్ స్కోరు 150 మార్కు దాటింది.