సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Director Sampath Nandi clarifies about the shoot of Seeteemar
  • వెయిట్ చేస్తామంటున్న 'సీటీమార్' దర్శకుడు 
  • బాలకృష్ణ సినిమాలో జయప్రద ప్రత్యేక పాత్ర
  • రాజశేఖర్ సరసన యువ కథానాయిక   
*  గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న 'సీటీమార్' చిత్రం షూటింగును ప్రారంభించడానికి మరికొంత సమయం  పడుతుందని చిత్ర దర్శకుడు సంపత్ నంది పేర్కొన్నారు. ఇది స్పోర్ట్స్ డ్రామా సినిమా కాబట్టి, చాలా మంది ఆర్టిస్టుల కలయికలో సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని, అందుకని కరోనా నేపథ్యంలో మరికొంత సమయం వేచిచూడాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు.
*  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది. కాగా, ఇందులో ప్రముఖ నటి జయప్రద ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది.
*  డా. రాజశేఖర్ హీరోగా నీలకంఠ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో కథానాయికగా రిచా పనై నటిస్తుంది. ఇందులో రాజశేఖర్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారు.
Gopichand
Tamannaah
Balakrishna
Jayaprada
Rajashekhar

More Telugu News