IYR Krishna Rao: ప్రభుత్వాలు మారినా భూకబ్జాలు మారేటట్లు లేవు: ఐవైఆర్‌ కృష్ణారావు

IYR Tweets on tdp ycp
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ, వైసీపీ తీరుపై ఏపీ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు విమ‌ర్శ‌లు కురిపించారు. "గొడవర్తి పద్మావతి గారి భూమి విషయం తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో ప్రచారంలోకి రావడం నేను కూడా ఆ అంశాన్ని పరిశీలించిన తర్వాత దీనిని గురించి వైఎస్ జ‌గ‌న్ గారు నిర్వహించిన విశాఖ సభలో ప్రస్తావించడం జరిగింది. ఆ రోజుల్లో షేక్ సలీం గారు ఆమె తరఫున నిలబడి నన్ను చాలాసార్లు కలిశారు.

ఈ భూమిని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యక్తులుగా కబ్జా చేసిన వాళ్లు ఈ రోజు వైసీపీ మనుషులు అయిపోయినట్లు ఉంది. ప్రభుత్వాలు మారినా భూకబ్జాలు మారేటట్లు లేవు. ఆ రోజు ఆ పార్టీ వ్యక్తులు ఈరోజు ఈ పార్టీ వాళ్ళు అయ్యేటట్లు ఉన్నారు" అని పేర్కొన్నారు.
Go Back to Shorts
IYR Krishna Rao
Telugudesam
YSRCP

More Telugu News