పొగాకు కొనుగోళ్లు: కంపెనీలకు మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్ వార్నింగ్
- పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించబోమన్న మంత్రి అచ్చెన్నాయుడు
- సిండికేట్గా మారి ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- అన్ని వేలం కేంద్రాలను వెంటనే ప్రారంభించి, ప్రతి కంపెనీ పాల్గొనాలని ఆదేశం
- రైతుల నుంచి తిరస్కరణలు తగ్గించి, అన్ని గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేయాలని సూచన
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పొగాకు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లను తక్షణమే ప్రారంభించాలని, వేలం ప్రక్రియలో ప్రతి కంపెనీ తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. రైతులు పండించిన అన్ని రకాల గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేయాలని సూచించారు. వేలం ప్రక్రియను పొగాకు బోర్డు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు.