'మారుతి'లో మరిన్ని వాటాలు చేజిక్కించుకున్న సుజుకి మోటార్స్ కార్పొరేషన్
- మారుతి సుజుకిలో 0.9 శాతం పెరిగిన మాతృసంస్థ వాటా
- 2,84,322 ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసిన సుజుకి కార్ప్
- డీల్ విలువ రూ.204.31 కోట్లు
ఈ కొనుగోలు డీల్ కు ముందు మారుతి సుజుకిలో సుజుకి మోటార్స్ కార్పొరేషన్ కు 56.28 శాతం వాటాలు ఉండగా, ఇప్పుడది 0.9 పెరిగి 56.37కి చేరింది. ఈ కొనుగోలు వ్యవహారాన్ని మారుతి సుజుకి బాంబే స్టాక్ ఎక్చేంజి (బీఎస్ఈ)కి నివేదించింది. సుజుకి కార్పొరేషన్ ఈ ఏడాది మార్చిలో 2,11,000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దాంతో ఈ జపాన్ దిగ్గజం వాటా 0.7 శాతం పెరిగి 56.28గా నమోదైంది.