‘పెద్ది’, ‘టాక్సిక్‌’, ‘జన నాయగన్‌’ను దాటేసింది.. టాప్‌-3లో ‘హనుమాన్‌ అంశ్‌’

‘పెద్ది’, ‘టాక్సిక్‌’, ‘జన నాయగన్‌’ను దాటేసింది.. టాప్‌-3లో ‘హనుమాన్‌ అంశ్‌’

Hanuman Ansh surpasses Peddi Toxic and Jana Nayagan to reach Top 3
  • రూ.10 లక్షల ఓపెనింగ్‌తో మొదలైన ‘హనుమాన్‌ అంశ్‌’
  • ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 కోట్ల వసూళ్లు
  • 2026 ఇండియన్‌ సినిమా టాప్‌-3లోకి ఎంట్రీ
  • ఐదో వారంలో ఏకంగా రూ.90.25 కోట్ల వసూళ్లు
  • దేశీయంగా ‘బోర్డర్‌ 2’ను దాటడమే తదుపరి లక్ష్యం
ఓ చిన్న సినిమాగా థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజు కేవలం రూ.10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. రెండు వారాల్లో వచ్చిన కలెక్షన్‌ రూ.1.50 కోట్లలోపే. కానీ ఆ తర్వాత సీన్‌ పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన మౌత్‌ టాక్‌తో దూసుకెళ్లిన ‘హనుమాన్‌ అంశ్‌’ ఇప్పుడు 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్‌-3లోకి చేరింది.

విశాల్‌ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భక్తి ప్రధానమైన చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.366.45 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. దీంతో ‘టాక్సిక్‌’, రామ్‌చరణ్‌ ‘పెద్ది’, విజయ్‌ ‘జన నాయగన్‌’ వంటి భారీ చిత్రాలను వెనక్కి నెట్టింది. ప్రస్తుతం 2026 వరల్డ్‌వైడ్‌ బాక్సాఫీస్‌లో ‘ధురంధర్‌ 2’, ‘బోర్డర్‌ 2’ తర్వాతి స్థానంలో ‘హనుమాన్‌ అంశ్‌’ నిలిచినట్లు ట్రేడ్‌ రిపోర్టులు చెబుతున్నాయి.

‘పెద్ది’ రూ.341.90 కోట్లు, ‘టాక్సిక్‌’ రూ.341.99 కోట్లతో తమ థియేట్రికల్‌ రన్‌ ముగించాయి. ‘జన నాయగన్‌’ సుమారు రూ.325 కోట్ల వసూళ్లు సాధించింది. వీటిని దాటిన ‘హనుమాన్‌ అంశ్‌’ ఏడో వారాంతంలోనూ భారీ వసూళ్లు రాబట్టింది.

మూడో వారంలో రూ.10.40 కోట్లు సాధించిన ఈ సినిమా.. నాలుగో వారంలో రూ.61 కోట్లు, ఐదో వారంలో ఏకంగా రూ.90.25 కోట్లు కొల్లగొట్టింది. ఆరో వారంలో మరో రూ.80.25 కోట్లు రాబట్టింది. ఏడో వారాంతంలో రూ.28.50 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది.

ఈ సినిమా బడ్జెట్‌ సుమారు రూ.2 కోట్లు అని సమాచారం. దేశీయంగా రూ.280.93 కోట్ల నెట్‌, రూ.325.80 కోట్ల గ్రాస్‌ సాధించగా.. ఓవర్సీస్‌ నుంచి రూ.26.50 కోట్లు వచ్చాయి. భారీ స్టార్‌ సినిమాలు పోటీ పడుతున్న సమయంలో ఓ చిన్న భక్తి చిత్రం ఇంతటి వసూళ్లు సాధించడం ట్రేడ్‌ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇక దేశీయ బాక్సాఫీస్‌లో ‘బోర్డర్‌ 2’ను దాటడం తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది. ‘బోర్డర్‌ 2’ రూ.329.43 కోట్ల ఇండియా నెట్‌ వసూళ్లతో ముగియగా.. ‘హనుమాన్‌ అంశ్‌’ ప్రస్తుతం రూ.275.88 కోట్ల వద్ద ఉంది. దీంతో ఆ రికార్డును అధిగమించాలంటే మరో రూ.53.55 కోట్లు రాబట్టాల్సి ఉంది.
Advertisement
Hanuman Ansh
Vishal Chaturvedi
Box Office Collection 2026
Peddi Movie
Toxic Movie
Jana Nayagan Movie

More Telugu News