కంగనా రనౌత్ పై పరోక్ష విమర్శలు గుప్పించిన ఉద్ధవ్ థాకరే
- ముంబైని పీఓకేతో పోల్చిన కంగన
- కంగనపై విమర్శలు ఎక్కుపెడుతున్న శివసేన నేతలు
- ఉపాధిని పొందుతున్న నగరంపై కొందరికి కృతజ్ఞత ఉండదన్న థాకరే
ఇటీవలే మరణించిన శివసేన ఎమ్మెల్యే అనిల్ రాథోడ్ కి ఈ రోజు ఉద్ధవ్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమకు ఉపాధిని కల్పిస్తున్న నగరంపై చాలా మందికి కృతజ్ఞత ఉంటుందని... కొందరికి మాత్రం ఉండదని చెప్పారు. అనిల్ భయ్యా రాజస్థాన్ నుంచి వచ్చారని, మహారాష్ట్రను తన నివాసంలా భావించారని... ఒక గొప్ప శివసైనికుడిగా మారారని అన్నారు.
మరోవైపు కంగనపై శివసేన నేతల విమర్శలు ఎక్కువైన సంగతి తెలిసిందే. ముంబైలో అడుగు పెట్టొద్దు అనే హెచ్చరికలు సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది.