తప్పు చేశాను... అందుకే చచ్చిపోతున్నా... నంద్యాల డెంటిస్ట్ మాధవీలత సూసైడ్ నోట్ వెల్లడి!
- 16న నంద్యాలలో మాధవీలత ఆత్మహత్య
- చేసిన పొరపాటుతో తీవ్ర మనస్తాపం
- మరో వివాహం చేసుకోవాలని భర్తకు వినతి
ఈ లేఖలో మాధవీలత, తాను తప్పు చేశానని, తనను క్షమించాలని భర్తను ఉద్దేశించి రాసింది. చేసిన పొరపాటుకు మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. బాధ్యతగా కొడుకును చక్కగా చూసుకోవాలని భర్తను కోరింది. భర్తతో తాను బాధ్యతగా ఉండలేకపోయానని చెబుతూ, మరో వివాహం చేసుకోవాలని కోరింది. ఎవరైనా ఎందుకు నీ భార్య ఆత్మహత్య చేసుకుందని అడిగితే, ఓ వ్యాధితో బాధపడుతూ తట్టుకోలేక చనిపోయిందని చెప్పాలని రాసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.