'జబర్దస్త్'లో సరికొత్త కరోనా స్క్రిప్టులు.. మూడు నెలల సంతోషాన్ని ఒకేసారి పొందొచ్చు !: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్'లో సరికొత్త కరోనా స్క్రిప్టులు.. మూడు నెలల సంతోషాన్ని ఒకేసారి పొందొచ్చు !: రోజా

roja about jabardasth
  • జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫన్
  • మళ్లీ షూటింగ్‌ ప్రారంభమైంది
  • కష్టమైన పరిస్థితులను కూడా కామెడీగా మలిచి వినోదం
  • ఫుల్‌ జోష్‌తో, ఫన్‌తో మళ్లీ మీ ముందుకు జబర్దస్త్ వస్తోంది
లాక్‌డౌన్‌ తర్వాత నానక్‌రాం గూడ రామానాయుడు స్టూడియోలో కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దాదాపు మూడు నెలల తర్వాత జబర్దస్త్ షూటింగులో పాల్గొనడంపై రోజా స్పందించారు.

'జబర్దస్త్‌, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫన్. ప్రజలు తమ కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. 10 నిమిషాల ముందే జబర్దస్త్ కోసం టీవీ ముందు కూర్చుంటారు. కరోనా వల్ల జబర్దస్త్‌ను మిస్సయ్యారు' అని తెలిపారు.

'పాత జబర్దస్త్ వీడియోలు మాత్రమే ప్రసారమవుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్లు కొత్త ప్రోగ్రాంలు రాకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. ప్రజలను ఎప్పుడెప్పుడు ఎంటర్‌టైన్‌ చేద్దామా? అని మేము చాలా హుషారుగా ఉన్నాం. మళ్లీ షూటింగ్‌ ప్రారంభమైంది' అని రోజా చెప్పారు.

'ఈ కరోనాను బేస్‌ చేసుకుని అనేక స్క్రిప్ట్‌ లు రాబోతున్నాయి. ఇంత కష్టమైన పరిస్థితులను కూడా కామెడీగా మలిచి వినోదం పంచడానికి రెడీగా ఉన్నాం. మా టెన్షన్స్‌ పోగొట్టుకోవడానికి కూడా జబర్దస్త్ ఉపయోగపడుతుంది. మూడు నెలల సంతోషాన్ని ఒకేసారి పొందొచ్చు. అనసూయ, రష్మీల గ్లామర్‌ కూడా మళ్లీ చూసే అవకాశం వస్తుంది. ఫుల్‌ జోష్‌తో, ఫన్‌తో మళ్లీ మీ ముందుకు వస్తోంది' అని రోజా తెలిపారు.

ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్‌ ప్రారంభమైంది. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కొత్త టీమ్స్‌ వస్తున్నాయి. వినోద రంగం మళ్లీ ప్రారంభమైంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం' అని  చెప్పింది.
Roja
Jabardasth
Rashmi Gautam
anasuya

More Telugu News