ఒకే విషయంలో పదే పదే ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారు?: కన్నా
- ఎస్ఈసీ వ్యవహారంలో ప్రభుత్వ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు
- హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ
- ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకోమన్న కన్నా
ఒకే విషయంలో (ఎస్ఈసీ) ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకోవాలని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.