సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- వెబ్ సీరీస్ లోకి మలయాళ భామ
- తండ్రీకొడుకులు కలసి నటించే చిత్రం
- మరో చిత్రానికి ఓకే చెప్పిన శర్వానంద్
* ప్రముఖ నటుడు విక్రం తన 60వ చిత్రాన్ని 'పేట' ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. విశేషం ఏమిటంటే, ఇందులో విక్రం తనయుడు ధృవ్ కూడా నటిస్తాడట. ధృవ్ గతేడాది 'ఆదిత్య వర్మ' (అర్జున్ రెడ్డి తమిళ రీమేక్) చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగానికి హీరోగా పరిచయం అయ్యాడు.
* శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. నూతన దర్శకుడు శ్రీరాం రెడ్డి దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇదిలావుంచితే, శర్వానంద్ నటించిన 'శ్రీకారం' చిత్రం విడుదలకు సిద్ధం కాగా, మరోపక్క అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' చిత్రాన్ని చేస్తున్నాడు.