Prabhas: ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ రాసిన కథ ఇది: నిర్మాత అశ్వనీదత్

Ashvinidath about Nag Ashwin Movie
షార్ట్స్‌లో చూడండి
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఎన్నో భారీ చిత్రాలను నిర్మించారు. ఆయా కథానాయకుల కెరియర్లో అవి చెప్పుకోదగిన చిత్రాలుగా నిలిచిపోయాయి. అలా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో 'జగదేకవీరుడు అతిలోక సుందరి' ఒకటి. సోషియో ఫాంటసీగా రూపొందిన ఆ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా 30 ఏళ్లను  పూర్తి చేసుకున్న సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడారు.

'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరువాత మా సంస్థ నుంచి మరో ఫాంటసీ చిత్రం రాబోతోంది. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ ఈ కథను సిద్ధం చేశాడు. నాగ్ అశ్విన్ కథ చెబుతున్నప్పుడు, ప్రభాస్ అయితేనే కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది. క్రేజ్ పరంగా, మార్కెట్ పరంగా, ఇతర భాషా ప్రేక్షకులకు ఈ కథ చేరువకావడానికిగాను ప్రభాస్ ను తీసుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. ఒకసారి కథ వినగానే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని బట్టి కథ ఎంత పెర్ఫెక్ట్  గా వచ్చిందనేది అర్థం చేసుకోవచ్చు. మా సంస్థ నుంచి ఒక అద్భుతమైన చిత్రం రానుందనే విషయాన్ని నమ్మకంగా చెప్పగలను. అక్టోబర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదల చేయనున్నాము" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Prabhas
Nag Ashwin
Ashwini Dutt

More Telugu News