'ఫైటర్' కోసం సెట్స్ వేయించే ఆలోచనలో పూరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఫైటర్' కోసం సెట్స్ వేయించే ఆలోచనలో పూరి

Fighter Movie
  • షూటింగు దశలో 'ఫైటర్'
  • లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
  • మనసు మార్చుకున్న పూరి
పూరి జగన్నాథ్ తాజా చిత్రంగా 'ఫైటర్' రూపొందుతోంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ముంబై నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన కొంతకాలంగా అక్కడే షూటింగు చేస్తూ వస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగు ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ముంబైలో కరోనా ఒక రేంజ్ లో విస్తరిస్తోంది. లాక్ డౌన్ అక్కడ ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. లాక్ డౌన్ తొలగించినా అక్కడ ధైర్యంగా షూటింగు చేసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సెట్స్ వేసి షూటింగ్ లాగించేయడమే కరెక్ట్ అనే నిర్ణయానికి పూరి వచ్చాడని చెబుతున్నారు. సాధారణంగా పూరి తన సినిమాలకి సెట్స్ వేయించడు. అలాంటిది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి కావడంతో ఆయన సెట్స్ వైపు మొగ్గు చూపుతున్నటుగా చెబుతున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి కథానాయికగా అనన్య పాండే పరిచయమవుతున్న సంగతి తెలిసిందే.
Vijay Devarakonda
Ananya panday
Fighter Movie
Puri Jagannadh

More Telugu News