తన జోరు తగ్గలేదంటున్న కాజల్!
Add ap7am to your home Screen

తన జోరు తగ్గలేదంటున్న కాజల్!

Kajal Agarwal Hindi Movie
  • తెలుగులో చిరూ సరసన 'ఆచార్య'
  • తమిళంలో రెండు భారీ సినిమాలు 
  •  హిందీలో జాన్ అబ్రహం జోడీగా ఛాన్స్ 
తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి మంచి క్రేజ్ వుంది. ఇక హిందీలోను గుర్తింపును సంపాదించుకుంది. సుదీర్ఘ కాలంగా కాజల్ తన కెరియర్ ను నెట్టుకొస్తోంది. కెరియర్ పరంగా గ్యాప్ వచ్చిన ప్రతిసారి తిరిగి పుంజుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉండటం విశేషం.

కమల్ సరసన నాయికగా ఆమె 'భారతీయుడు 2' సినిమా చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, షూటింగు దశలో వుంది. ఇక చిరంజీవితో కొరటాల చేస్తున్న 'ఆచార్య' సినిమాలోనూ నాయికగా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు గతంలో విజయ్ తో కలిసి భారీ హిట్లు కొట్టిన కాజల్, మరోసారి ఆయన జోడీ కట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక హిందీలోను ఆమె ఒక ప్రాజెక్టుకు ఓకే చెప్పింది. జాన్ అబ్రహం హీరోగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఓ భారీ ప్రాజెక్టు కోసం ఆమెను ఎంపిక చేశారు. మొత్తానికి కాజల్ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ తన జోరు తగ్గలేదని నిరూపిస్తోంది.
Kajal Agarwal
Chiranjeevi
Kamal Haasan
Vijay
John Abraham

More Telugu News