మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తాను: అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తాను: అనిల్ రావిపూడి

Anil Ravipudi Movie
  • నా గది గోడకి ఆ ఫొటో ఉండేది 
  •  నా సన్నిహితులతో ఆ మాట చెప్పేవాడిని 
  •  అభిమానాన్ని చాటుకున్న అనిల్ రావిపూడి  
తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుల జాబితాలో అనిల్ రావిపూడి ఒకరుగా కనిపిస్తాడు. ఇటీవల 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నాడు.

తాజాగా ఒక షోకి సంబంధించిన వేదికపై ఆయన మాట్లాడుతూ .. "నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న సమయంలో నా గదిలోని గోడకి, మోక్షజ్ఞతో కలిసి బాలకృష్ణ దిగిన ఫొటో ఉండేది. ఆ ఫొటో చూసినప్పుడల్లా మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఒక సినిమా చేయాలనిపించేది. కుదిరితే బాలకృష్ణగారితోను సినిమా చేయాలనుండేది. ఆ ఇద్దరి కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తానని కూడా నా సన్నిహితులతో చెబుతుండేవాడిని" అంటూ నందమూరి ఫ్యామిలీపై అనిల్ రావిపూడి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మరి తండ్రీ కొడుకులతో వేరు వేరుగా సినిమాలు చేసే అవకాశం వస్తుందా? లేదంటే ఆ ఇద్దరితో మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ వస్తుందా? అనేది చూడాలి.
Balakrishna
Mokshagna
Anil Ravipudi Movie

More Telugu News