'సాహో'లో సాంగ్ మిస్ అయిన అనుష్క!
- వరుస సినిమాలు చేసిన ప్రభాస్ - అనుష్క
- భారీ విజయాల కారణంగా ఏర్పడిన క్రేజ్
- అందుకే స్పెషల్ సాంగ్ సెట్ కాలేదట
ఎందుకంటే 'బిల్లా' .. 'మిర్చి' .. 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలతో ఈ జంటకి ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం లభించింది. అందువలన ఈ జోడీపై ఒక సాంగ్ ను పెడితే అది సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని భావించారట. అందుకు అనుష్క కూడా అంగీకరించిందట. అయితే ఆ సాంగును చిత్రీకరించాలని అనుకున్నప్పుడు, 'నిశ్శబ్దం' సినిమాకి సంబంధించి తన డేట్స్ ను సర్దుబాటు చేయడం కుదరలేదట. అందువల్లనే ప్రభాస్ తో అనుష్క ప్రత్యేక గీతం కుదరలేదనే వార్త తాజాగా బయటికి వచ్చింది.