Ashok Gajapathi Raju: వైసీపీ నేతలు ఓట్లు అడగడం మానేసి దౌర్జన్యం చేస్తున్నారు: అశోక్ గజపతిరాజు

Ashok Gajapathi Raju furious on YSRCP
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ
  • వైసీపీని ఇంటికి పంపే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్న గజపతిరాజు
  • టీడీపీ అభ్యర్థులు వైసీపీకి దీటుగా ప్రచారం చేయాలని సూచన
స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం వైసీపీ, టీడీపీ మధ్య యుద్ధంలా మారింది. రాష్ట్రంలో అనేక చోట్ల నామినేషన్ల తంతు హింసాత్మక రూపుదాల్చింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు ఓట్లు అడగడం మానేసి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని ఇంటికి పంపే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని అన్నారు. వైసీపీకి దీటుగా టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజవేయాలని సూచించారు.

More Telugu News

Ashok Gajapathi Raju
Telugudesam
YSRCP
Local Body Polls
Andhra Pradesh