తమకు జరిగిన అన్యాయంపై బీసీలు తగిన విధంగా బుద్ధి చెప్పాలి: రామానాయుడు

Nimmala Ramanaidu fires YSRCP government
స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశం నేపథ్యంలో టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల నిబంధనలను వైసీపీ ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఓవైపు కోడ్ ఉల్లంఘన జరుగుతుంటే ఎన్నికల సంఘం నిద్రపోతోందా? అని ప్రశ్నించారు. గెలిచే అవకాశం లేని చోట ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోసం రాష్ట్రాన్ని ఐదు జోన్లుగా విభజించిన సీఎం జగన్, వాటికి ఇన్ చార్జిలుగా రెడ్లనే నియమించారని విమర్శించారు. తమకు జరిగిన అన్యాయంపై బీసీలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని అన్నారు.
Go Back to Shorts
Nimmala Rama Naidu
Local Body Polls
BC Reservations
YSRCP
Jagan
Telugudesam
Andhra Pradesh

More Telugu News