ప్రభాస్ హీరోగా కొరటాల మూవీ .. నిర్మాణ సంస్థగా మైత్రీ

Koratala Siva Movie
  • చిరూ సినిమాతో బిజీగా కొరటాల 
  • తదుపరి సినిమా చరణ్ తో 
  • 'మిర్చి' కాంబినేషన్ మళ్లీ సిద్ధం
ప్రస్తుతం చిరంజీవి సినిమాతో కొరటాల శివ బిజీగా వున్నాడు. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రాన్ని ఆయన రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చరణ్ కథానాయకుడిగా ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. ఆల్రెడీ చరణ్ కి ఆయన కథ వినిపించడం .. చరణ్ ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కొరటాల టీమ్ కసరత్తు నడుస్తూనే ఉందని చెబుతున్నారు.

ఈ ప్రాజెక్టు తరువాత ప్రభాస్ తో కొరటాల సినిమా వుండనుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో కొరటాల - ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన 'మిర్చి' భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే కొరటాల దర్శకుడిగా పరిచయమయ్యాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ కావడం, ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయం. నాగ్ అశ్విన్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ సెట్స్ పైకి వెళ్లేది కొరటాలతోనే.
Go Back to Shorts
Prabhas
Nag Ashwin
Koratala Siva Movie

More Telugu News