విజిల్‌పోడు.. తాలా వచ్చేశాడు మరి!
- ఐపీఎల్ కోసం చెన్నై చేరిన ధోనీ
- ఘన స్వాగతం పలికిన సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ
- రేపటి నుంచి ప్రాక్టీస్ చేయనున్న మహీ
ధోనీ హోటల్లో అడుగుపెట్టిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఫ్రాంచైజీ ‘ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ వస్తాయని’ ట్యాగ్ లైన్ ఇచ్చింది. అలాగే, తాలా దర్శనం అని మరో ఫొటో పోస్ట్ చేసి.. విజిల్‌పోడు అని హాష్‌ట్యాగ్ ఇచ్చింది. ఇప్పుడు ఈ హాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. కాగా, మంగళవారం నుంచి ధోనీ ప్రాక్టీస్ మొదలు పెడుతాడని టీమ్ సీఈవో తెలిపారు. అలాగే, జట్టు అధికారిక ట్రైనింగ్ క్యాంప్ ఈ నెల 19న ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ నెల 29న జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబైతో చెన్నై తలపడనుంది.