చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్న జూనియర్ ద్రావిడ్
- డబుల్ సెంచరీలతో మోతమోగిస్తున్న ద్రావిడ్ తనయుడు సమిత్
- అండర్-14 లీగ్ లో సమిత్ భారీ ఇన్నింగ్స్ లు
- బంతితోనూ రాణిస్తున్న వైనం
తాజాగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 33 ఫోర్లు కొట్టి డబుల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు బౌలింగ్ లోనూ ఓ చేయి వేసి రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో సమిత్ జట్టునే విజయం వరించింది. డిసెంబరులో కోల్ కతాలో జరిగిన మ్యాచ్ లోనూ ఇంతే! బంతిని బౌండరీకి పంపడమే లక్ష్యంగా ఆడిన సమిత్ 22 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మనవాడి జోరు తగ్గలేదు. 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. జూనియర్ ద్రావిడ్ ఇంతకుముందు కూడా సెంచరీల మీద సెంచరీలు బాది కర్ణాటక క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేశాడు. అంత చిన్నవయసులో బౌలర్లకు చుక్కలు చూపించడం పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతకు నిదర్శనంలా నిలుస్తోంది.