చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. మీ డబ్బు మీరు వెనక్కి తీసుకోండి: విజయ్ మాల్యా
- ఆస్తుల కోసం అటు ఈడీ, ఇటు బ్యాంకులు పోరాడుతున్నాయి
- అసలులో వందకు వందశాతం వెనక్కి తీసుకోండి
- మనీలాండరింగ్ మోసాలకు పాల్పడలేదు
తీసుకున్న రుణాలను చెల్లించలేదని మాత్రమే బ్యాంకులు ఈడీకి ఫిర్యాదు చేశాయని, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తానెటువంటి నేరాలకు పాల్పడలేదని స్పష్టం చేశాడు. అయితే, ఈడీ మాత్రం తన ఆస్తులను జప్తు చేసిందని మాల్యా ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకే రకమైన ఆస్తుల కోసం ఓ వైపు ఈడీ, మరోవైపు బ్యాంకులు పోరాడుతున్నాయని పేర్కొన్న మాల్యా.. బ్యాంకులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవాలని కోరాడు.