సొంతంగా ఒక్క భవనం కూడా కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా?: చంద్రబాబు విసుర్లు
- వైసీపీ సర్కారుపై చంద్రబాబు విమర్శలు
- ఒక్క కంపెనీ తీసుకురావడం చేతకాదంటూ వ్యాఖ్యలు
- కరోనా వైరస్ ను మించిపోయిందీ వైసీపీ వైరస్ అంటూ వ్యంగ్యం
"సింగపూర్ కన్సార్టియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్ అన్నీ ఈ 8 నెలల్లో క్యూ కట్టాయి. అమరావతిలో సచివాలయం ఉండగా అది చాలదన్నట్టు విశాఖలో మిలీనియం టవర్ లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారంట! చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ను మించిపోయిందీ వైసీపీ వైరస్. ఈ ఎనిమిది నెలల్లోనే ఏపీని చెల్లాచెదురు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారు. కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు పోతున్నాయి" అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.