బెల్లంకొండ మూవీకి భారీ బడ్జెట్టునే కేటాయించారట
- 'రాక్షసుడు'తో పలకరించిన హిట్
- తదుపరి సినిమా దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్
- నాయికలుగా నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్
ఈ కారణంగానే 'రాక్షసుడు' సినిమాను తక్కువ బడ్జెట్లో చేశారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించడంతో, ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ చేస్తున్న సినిమా నిర్మాతలు బాగానే ఖర్చు చేస్తున్నారట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించి, నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో ఎంత మాత్రం రాజీ పడటం లేదని అంటున్నారు. యాక్షన్ సీన్స్ ను కూడా భారీగానే ప్లాన్ చేశారని చెబుతున్నారు. నభా నటేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో, విలన్ గా సోనూ సూద్ ను తీసుకున్నారు.