‘డిగ్రీ కాలేజ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ గుంటూరులో ఆందోళన
- పవిత్రమైన కళాశాలను అశ్లీలానికి నిలయంగా మార్చివేశారు
- డబ్బు సంపాదన కోసం ఇంతలా దిగజారాలా?
- ప్రభుత్వం అనుమతి ఎలా ఇచ్చిందన్న విద్యార్థులు
తాజాగా, ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ గుంటూరులోని బాలీవుడ్, హాలీవుడ్ సినిమా థియేటర్ల వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వరంలో నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పవిత్రమైన కళాశాలను అశ్లీలానికి నిలయంగా ఈ సినిమాలో మార్చివేశారని ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంపాదన కోసం ఇంతగా దిగజారడం తగదన్నారు.
ఈ సందర్భంగా సెన్సార్ బోర్డుపైనా వారు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం దారుణమన్నారు. దిశ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఇలాంటి సినిమాల విడుదలకు అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. వెంటనే ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.