మీరూ ఇందులో నిరభ్యంతరంగా చేరొచ్చు: చంద్రబాబుకి విజయసాయిరెడ్డి చురక
- మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదంటున్నారు
- చంద్రబాబుది బిజినెస్ మైండ్ కదా?
- ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు
- జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు
'మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తాడు. రేట్లు పెంచింది రాబడి కోసం కాదు బాబూ. తాగడం తగ్గించడం కోసం. సీఎం జగన్ గారు జిల్లాకో డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయించారు. మీరూ నిరభ్యంతరంగా చేరొచ్చు' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.