రాజధాని పరిరక్షణ అంటూ 'పెయిడ్ ఆర్టిస్టులను' దించాడు: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

రాజధాని పరిరక్షణ అంటూ 'పెయిడ్ ఆర్టిస్టులను' దించాడు: విజయసాయిరెడ్డి

  • ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు
  • జోలె పట్టి చందాలకు తిరిగాడు
  • 'కౌన్సిల్ ను ఎలా రద్దు చేస్తారో చూస్తా' అంటున్నాడు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 'రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను దించాడు. ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగాడు. ఇప్పుడవన్నీ వదిలేసి కౌన్సిల్ ను ఎలా రద్దు చేస్తారో చూస్తా అని రంకెలేస్తున్నాడు. చిట్టి నాయుడు, ‘వెన్నుపోటు’ సహచరుడు నిరుద్యోగులవుతారని ఆయనకు భయం పట్టుకుంది' అని ట్వీట్ చేశారు.

'అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్టజెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట' అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
YSRCP
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News