పొత్తుల విషయంలో చంద్రబాబుపై మంత్రి అనిల్ సెటైర్లు
- చంద్రబాబు ట్రంప్ తోనైనా పొత్తు పెట్టుకోగలరని ఎద్దేవా
- జగన్ సింహం లాంటివాడని వ్యాఖ్యలు
- 2024లో పొత్తు లేకుండా పోటీ చేసే ధైర్యం ఉందా అంటూ సవాల్
కానీ, సీఎం జగన్ సింహం లాంటివాడని, ఆయన నాయకత్వంలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందని, 2024లో కూడా తాము ఒంటరిగానే పోటీకి దిగుతామని అనిల్ పేర్కొన్నారు. వైసీపీ పొత్తుల కోసం చూసే పార్టీ కాదని స్పష్టం చేశారు. 2024లో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా? అంటూ మంత్రి సవాల్ విసిరారు.