ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది: విజయసాయిరెడ్డి
Add ap7am to your home Screen

ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది: విజయసాయిరెడ్డి

  • అమరావతికి వరద ముప్పు లేదంట
  • రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అట 
  • కోల్‌కతా, ముంబై ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. అమరావతి విషయంపై అసత్య ప్రచారం చేస్తోందని చెప్పుకొచ్చారు.

'అమరావతికి వరద ముప్పు లేదంట. రేగడి నేలలైనా భారీ నిర్మాణాలకు అనుకూలమే అని చెప్పడానికి ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చివరకు కోల్‌కతా, ముంబై నగరాలు ప్రమాదకరమైనవని తీర్పు చేప్పే సాహసానికి తెగబడింది. చంద్రబాబు నక్క అంటే నక్క, కుక్క అంటే కుక్క అనడమే పచ్చ మీడియా పని' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News