వైజాగ్ అమ్మాయిల అందంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- ఆంధ్రా యూనివర్శిటీ ఇక్కడే ఉంది
- విశాఖ సముద్ర తీరం నాకెంతో ఇష్టం
- 'అల వైకుంఠపురములో..' సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్
చలం, రావిశాస్త్రి, సీతారామశాస్త్రి వంటి ఎందరో మహానుభావులను అందించిన వైజాగ్, ఎన్నో ఒంపులున్న మహానగరమని, ఈ నగరానికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కవితాత్మకంగా వైజాగ్ విశిష్టతను తెలిపారు. తాను ఇక్కడే చదువుకున్నానని, ఆనాటి జ్ఞాపకాలు తన మనసులో పదిలంగా ఉన్నాయని, తన భవిష్యత్తుకి బాటలు వేసిన విశాఖకు రుణపడివుంటానని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలిపారు.