'దర్బార్' నుంచి లిరికల్ వీడియో సాంగ్
- పోలీస్ ఆఫీసర్ గా రజనీకాంత్
- ముఖ్యమైన పాత్రలో నివేద థామస్
- సంగీత దర్శకుడిగా అనిరుధ్
'తలైవా ఇన్ ఛార్జ్ .. 'అంటూ ఈ పాట సాగుతోంది. అనిరుధ్ బాణీలో భాస్కర భట్ల తెలుగు పదాలను అమర్చాడు. రజనీ క్రేజ్ ను .. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాటను కంపోజ్ చేశారు. మిగతా వాళ్లకి మాత్రం ఈ పాట కాస్త గందరగోళంగానే అనిపిస్తుంది. ఈ సినిమాలో రజనీ సరసన నాయికగా నయనతార కనిపించనుంది. ఓ ముఖ్యమైన పాత్రను నివేదా థామస్ పోషించింది. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుందని రజనీ అభిమానులు భావిస్తున్నారు.