తెలంగాణకు తర్వాతి సీఎం ఎవరో చెప్పేసిన మహబూబాబాద్ ఎంపీ కవిత
- గ్రీన్ చాలెంజ్‌ను పూర్తి చేసిన మాలోతు కవిత
- పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బలోపేతం చేస్తున్నారని ప్రశంస
- కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనంటూ జోస్యం
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ తర్వాతి ముఖ్యమంత్రి కేటీఆరేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని ఆయన మరింత ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. మంత్రిగానూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరేనని కవిత పునరుద్ఘాటించారు.