వెండితెరపై సోలో రోల్ ఫుల్ లెన్త్ లో చేస్తాననుకోలేదు: ‘జబర్దస్త్’ సుడిగాలి సుధీర్
- నా సినిమాకు టికెట్లు కొనుక్కుని ప్రేక్షకులు వస్తారనుకోలేదు
- ఒకప్పుడు పెద్ద హీరోల మూవీస్ కు వెళితే పేపర్ ముక్కలు విసిరేసేవాడిని
- ఇప్పుడు నా సినిమాకు ప్రేక్షకులు అలాగే వేస్తున్నారు
ఒకప్పుడు చిరంజీవి, పవన్ కల్యాణ్.. పెద్ద హీరోల సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు పేపరు ముక్కలను థియేటర్ లో విసిరివేసేవాడినని, అలాంటిది, తాను నటించిన సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఇదేవిధంగా చేయడం ఊహించలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ చిత్రం సింగిల్ లైన్ మాత్రమే విన్నానని, ఆ తర్వాత కథ వింటానని దర్శకుడు రాజశేఖర్ రెడ్డికి చెప్పాను కానీ, ఏకంగా షూటింగ్ కే వెళ్లిపోయానని గుర్తుచేసుకున్నాడు. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మంచి విజన్ డైరెక్టర్ అని, చాలా కూల్ గా ఉంటారని అన్నాడు.