నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం.. అసలు విషయం తెలిసి పోలీసుల షాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటుడు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం.. అసలు విషయం తెలిసి పోలీసుల షాక్!

  • గత నెలలో ఔటర్ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్ కారుకు ప్రమాదం
  • డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసిన పోలీసులు
  • రాజశేఖర్ అసలు లైసెన్స్ లేకుండానే వాహనం నడుపుతున్నట్టు వెల్లడి
టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు గత నెల 13న ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యారంటూ రాజశేఖర్‌పై కేసు నమోదు చేసి, డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని టోలీచౌకీ ఆర్టీఏ అధికారులకు శంషాబాద్ పోలీసులు లేఖ రాశారు. దీంతో వారు ఈ ఏడాది నవంబరు 29 నుంచి వచ్చే ఏడాది మే 20 వరకు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

అంత వరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాత తెలిసిన విషయం పోలీసులను విస్తుపోయేలా చేసింది. నిజానికి రాజశేఖర్ డ్రైవింగ్ లెసెన్స్ అసలు మనుగడలోనే లేదని తేలింది. దీంతో షాకైన పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతున్న నటుడిపై మరో కేసు నమోదు చేయాలని తాజాగా నిర్ణయించారు. రాజశేఖర్ వాహనంపై ఏడాదిలో 21 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నట్టు తేలింది. వీటిలో 19 పరిమితికి మించిన వేగానికి సంబంధించినవే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన లైసెన్స్ సస్పెన్షన్‌లో ఉండడంతో ఇప్పటికిప్పుడు పునరుద్ధరించుకోవడం సాధ్యం కాదని, మే 28 తర్వాత మాత్రమే అది సాధ్యమవుతుందని సమాచారం. లైసెన్స్ లేకుండా అప్పటి వరకు వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Tollywood
Actor Rajasekhar
driving licence

More Telugu News